: ఇద్దరు స్టార్ నటుల కుమార్తెలతో... బాలీవుడ్ సీక్వెల్?
బాలీవుడ్ సూపర్ మ్యాన్ టైగర్ ష్రాఫ్ తో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమా తీస్తున్నట్టు ఫిలిం మేకర్ కరణ్ జొహార్ ప్రకటించాడు. 2012లో తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాను ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు కధతో తెరకెక్కించగా, దాని సీక్వెల్ ను ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోతో తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. ఈ సినిమాలో హీరో పాత్రను 'భాఘీ' హిట్ తో జోరుమీదున్న జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో తీయనున్నట్టు ప్రకటించాడు. అతని సరసన హీరోయన్ల వేట మొదలు పెట్టాడు. ఈ సినిమాలో కొత్త వారిని పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె జాన్వీలు అగ్రభాగాన ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరినీ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయం చేయాలని కరణ్ జొహార్ భావిస్తున్నాడని సమాచారం.