: ‘దొంగతనం చేసినట్లు ఒప్పుకుంటావా.. లేదా?’.. నల్లజాతి యువతిపై ప్రతాపం చూపిన అమెరికా పోలీస్
అమెరికాలో నల్లజాతీయులపై పోలీసులు అకారణంగా కాల్పులు జరుపుతున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తినా అక్కడి పోలీసుల వైఖరిలో మాత్రం మార్పు కనబడడంలేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాజాగా దొంగతనం చేసిందంటూ ఓ నల్లజాతి యువతిని ఓ పోలీస్ అధికారి కారుకు అదిమిపట్టి పలు ప్రశ్నలు అడిగాడు. ఆ యువతి దొంగతనం ఒప్పుకోవాల్సిందేనంటూ ఆమెను కారుకి అదిమిపట్టాడు. తాను ఏ దొంగతనం చేయలేదంటూ, తనను వదిలేయమని ఆ యువతి పోలీసుని వేడుకున్నా పోలీసు అలాగే దురుసుగా వ్యవహరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ పోలీస్ అధికారులు పోలీసు చర్యపై విచారణకు ఆదేశించారు.