: తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు!... వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!


తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మరో తీపి కబురు పంపింది. ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా... తాజాగా పశుసంవర్ధక శాఖలోని ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం... ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్ష సెప్టెంబర్ 25న జరగనుంది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News