: పున్నమి ఘాట్ లో నరసింహన్!... సతీసమేతంగా గవర్నర్ పుష్కర స్నానం!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పుష్కర స్నానమాచరించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన నరసింహన్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా స్వాగతం పలికారు. నగరంలోని కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ కు గవర్నర్ ను ఆయన తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత సతీసమేతంగా నరసింహన్ పుష్కర స్నానం చేశారు. మరికాసేపట్లో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను గవర్నర్ దంపతులు దర్శించుకుంటారు.

  • Loading...

More Telugu News