: జాతీయ జెండా‌ను తలకిందులు చేసి సెల్యూట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్


గోవాలోని సాంగ్యూమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయ్‌కి జాతీయ జెండా ఎలా ఉండాలో కూడా తెలీదేమో! స్వాంతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఆయ‌న ఓ జెండాకు సెల్యూట్ చేస్తున్న‌ట్లు పోజిస్తూ ఫోటో దిగారు. ఆపై విమర్శలపాల‌వుతున్నారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఆయ‌న‌.. జాతీయ జెండా తలక్రిందులుగా ఉన్న విషయాన్ని కూడా గుర్తించ‌కుండా దానికి సెల్యూట్ చేశారు. ఆయ‌న సెల్యూట్ చేసిన జెండాలో.. కాషాయ రంగు కింది భాగంలో క‌నిపిస్తోంది. ఇక ఆకుప‌చ్చ రంగు పై భాగంలో క‌నిపిస్తోంది. దీనిప‌ట్ల సర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News