: మోదీ వ్యాఖ్యలకు, ప్రస్తుత పరిస్థితులకు పొంతన లేదు: సీతారాం ఏచూరి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలి సభల్లో పలు వ్యాఖ్యలు చేశారని, కానీ ఆయన మాటలకు ప్రస్తుత పరిస్థితులకు పొంతన లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం సంక్షోభంలోకి వెళుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) హెచ్చరికలు చేసిందని, వాటి పట్ల కేంద్రం పూర్తి నిర్లక్ష్యధోరణి కనబరుస్తోందని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రెట్టింపు చేస్తామని ఇచ్చిన మాటను మోదీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని ఏచూరి విమర్శించారు.