: స్వాతంత్ర్య దినోత్సవం రోజు పీకలదాకా తాగిన ఎక్సైజ్ కానిస్టేబుల్!


నిర్వ‌ర్తిస్తున్నది ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం. ఎప్పుడు మ‌ద్యం అమ్మాలో.. ఎప్పుడు అమ్మ‌కూడ‌దో చెప్పాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది. అయితే, ఆయ‌నే స్వాతంత్ర్య‌ దినోత్సవం రోజున పీక‌ల‌దాకా తాగాడు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఓ కానిస్టేబుల్ చేసిన ఈ నిర్వాకం వెలుగుచూసింది. ఎక్సైజ్‌ కార్యాలయంలో నిన్న‌ జాతీయ జెండాను ఎగురవేశారు. త‌రువాత అక్క‌డ‌ ఉన్న ఒకే ఒక్క‌ కానిస్టేబుల్ పీక‌ల‌దాకా మ‌ద్యం తాగి క‌నిపించ‌డం అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. దీనిపై స్పందించిన స్థానికులు అక్క‌డి పోలీస్‌స్టేషన్‌కు ఈ సమాచారాన్ని చేర‌వేశారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న‌ సివిల్‌ పోలీసులు స‌ద‌రు కానిస్టేబుల్ ఫుల్లుగా తాగిన ఉన్న విషయాన్ని సీఐకి చేర‌వేశారు.

  • Loading...

More Telugu News