: ఆయనకు నేను పెద్ద అభిమానిని, ఆయనతో కలిసి నటిస్తే కల నెరవేరినట్టే: అమీర్ ఖాన్


'ధూమ్ 3' సినిమాకి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో 'థగ్' సినిమా రూపొందనుంది. దీంతో ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో కలసి తొలిసారిగా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించనున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇంత కాలం మౌనంగా ఉన్న అమిర్ ఖాన్ తొలిసారి స్పందించాడు. తాను అమితంగా ఆరాధించి, గౌరవించే వారిలో అమితాబ్ ఒకరని అన్నాడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన తాను, ఆయనకు తాను పెద్ద అభిమానినని చెప్పాడు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. అలాంటిది ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తన కల నిజమైనట్టేనని చెప్పాడు. ఆయనతో కలిసి నటించడమనే తన కల నెరవేరుతుందని తాను భావిస్తున్నానని, ఎప్పుడనేది త్వరలోనే మీకు తెలుస్తుందని చెప్పిన అమీర్ ఖాన్...తామిద్దరం కలసి నటిస్తున్నామని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం 'దంగల్' షూటింగ్ లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్, గతంలో విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో 'ధూమ్ 3'లో నటించగా, అందులో అమితాబ్ నటించలేదు.

  • Loading...

More Telugu News