: స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ కుప్పకూలిన కన్నడ మంత్రి
కర్ణాటకలోని శివమొగలో నిర్వహించిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని శివమొగ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప (70) ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో స్పందించిన అధికారులు ఆయనను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఫోన్ చేసి మంత్రిని పరామర్శించారు. కుటుంబ సభ్యులనడిగి వివరాలు తెలుసుకున్నారు.