: అడిక్ మెట్ చిన్నారి ఆచూకీ లభ్యం... అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయం వద్ద హర్షిత


హైదరాబాద్ పరిధిలోని అడిక్ మెట్ లో కిడ్నాప్ కు గురైన హర్షిత ఆచూకీ లభ్యమైంది. ఎరుపు రంగు డ్రస్ వేసుకుని రోడ్డుపై ఉన్న హర్షిత (5) కు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసిందో యువతి. తల్లిదండ్రులు ఫిర్యాదుతో సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపధ్యంలో హర్షితను అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి గుడి దగ్గర ఆ యువతి వదిలినట్టు పోలీసులు గుర్తించారు. బాలిక చెవికమ్మలు తీసుకుని ఆమెను అక్కడ వదిలినట్టు తెలుస్తోంది. హర్షితను గుర్తించిన పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ గురించి ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News