: ఏపీలో 2050 దాకా టీడీపీదే అధికారం!... జోస్యం చెప్పిన అచ్చెన్నాయుడు!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తదుపరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ఎంతకాలం పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందన్న అంశాలపై భవిష్యత్ వాణి వినిపించిన అచ్చెన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... ఏపీలో 2050 దాకా టీడీపీనే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినా గడచిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తమ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ కారణంగానే తమ పార్టీ 2050 దాకా అధికారంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.