: నగ్న సన్నివేశాల్లో ‘కబాలి’ హీరోయిన్!... నెట్ లో వైరల్ గా మారిన రాధికా ఆప్టే వీడియో!


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రం ‘రక్త చరిత్ర’లో తన నటనతో సినీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ప్రముఖ నటి రాధికా ఆప్టే... వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవలే విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ లో రాధికా ఆప్టే నగ్న సన్నివేశాల్లో నటించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలి’లో ఛాన్స్ కొట్టేసిన ఆమె ఆ వివాదం నుంచి దాదాపుగా బయటపడిందన్న వాదన వినిపించింది. అయితే తాజాగా వెలుగుచూసిన ఓ వీడియో ఆప్టేను మరోమారు పెను వివాదంలోకి నెట్టేసింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘పార్చ్ డ్’ పేరిట నిర్మించిన తాజా చిత్రంలో రాధికా పూర్తిగా నగ్నంగా నటించింది. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో లీకైపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారిపోయింది.

  • Loading...

More Telugu News