: న్యూయార్క్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. ఎయిర్‌పోర్టును మూసేసిన భద్రతా సిబ్బంది


అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్‌లోని జాన్ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మనల్‌లో కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. టెర్మినల్ 8 వద్ద కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే భద్రతా సిబ్బంది గేట్లు మూసేసి ప్రయాణికులు, ఉద్యోగులను ఎవరినీ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. కాగా కాల్పుల విషయం సోషల్ మీడియాకెక్కడంతో వార్త వెలుగులోకి వచ్చింది. టెర్మినల్ 8లో చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు సోషల్ మీడియాలో పోస్టు అయిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. అయితే ఎయిర్‌పోర్టులో ఎటువంటి కాల్పులు జరగలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News