: పుష్కర విధుల్లో ఉన్న ఎన్సీసీ విద్యార్థికి పాముకాటు ...పరిస్థితి విషమం
పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సహకరించి, వారు సులువుగా ఘాట్లకు చేరేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్న ఓ ఎన్సీసీ విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ దురదృష్టకర ఘటన నల్గొండ జిల్లా మట్టపల్లి పుష్కర ఘాట్ వద్ద జరిగింది. స్వచ్ఛందంగా విధులు నిర్వహిస్తున్న ఈ విద్యార్థిని నేటి ఉదయం పాము కరిచింది. అది విషపూరిత పాము కావడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన అధికారులు ఇతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.