: ఇలాగే ఆడితే కెప్టెన్ ఎవరైనా వేస్టే: విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్


టీమిండియా చేతిలో మూడో టెస్టులో కూడా ఘోరపరాజయం విండీస్ కెప్టెన్ లో ఆగ్రహం కలిగించింది. దీంతో సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో పోరాడేతత్వం లేని జట్టుకు నాయకత్వం వహించడం చాలా కష్టమని పేర్కొన్నాడు. టాపార్డర్ బాధ్యతారాహిత్యమే మూడో టెస్టులో పరాజయానికి కారణమన్నాడు. డ్రా కావాల్సిన టెస్టును కోల్పోవడంపై జాసన్ హోల్డర్ మాట్లాడుతూ, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మరింత బాధ్యాతాయుతంగా ఆడాలన్నాడు. టాపార్డర్ లో నిలకడ అవసరమని తెలిపాడు. ఇంకా ఒక టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోవడం బాధగా ఉందని చెప్పాడు. పేలవ ప్రదర్శనతో ఓటమిపాలయ్యామని చెప్పాడు. ఇలా అయితే జట్టుకు కెప్టెన్ గా సేవలందించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సమష్టితత్వం టీమిండియాను చూసి నేర్చుకోవాలన్నాడు. ఆ జట్టులో ఆటగాళ్లంతా కలసికట్టుగా, నిలకడగా ఆడుతున్నారని అన్నాడు. టీమిండియా గత కొంతకాలంగా అత్యంత పటిష్టంగా, నిలకడగా ఉందని చెప్పాడు. యువకులు కలిగిన విండీస్ జట్టు టీమిండియాను స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. విండీస్ ఆటగాళ్లు సాధిస్తున్న 20, 30 పరుగులను భారీ స్కోర్లుగా మలచాలని సూచించాడు. నాలుగో టెస్టులో సత్తాచాటాలని బ్యాట్స్ మెన్ కు సూచించాడు.

  • Loading...

More Telugu News