: రాష్ట్రపతి భవన్ గేట్ నెంబర్ 1 దగ్గర అనుమానాస్పద బ్యాగు...భద్రతా దళాల ఉరుకులు పరుగులు
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రతా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ వద్దనున్న గేట్ నెంబర్ 1 వద్ద అనుమానాస్పద బ్యాగు కనిపించింది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఆరు ఫైరింజన్లను మోహరించారు. అక్కడ ప్రజలెవరూ అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించారు. దీంతో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది.