: అత్యంత బలహీన భారత ప్రధాని మోదీయే: లాలూ చురక


భారత్ కు ప్రధానిగా పనిచేసిన వారిలో ఇప్పుడు పాలిస్తున్న నరేంద్ర మోదీయే అత్యంత బలహీనమైన ప్రధానని రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన కేవలం పెద్ద పెద్ద మాటలు మాత్రమే చెప్పగలరని, ప్రజల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆందోళనలు పెరిగిన దేశంలో మెరుగైన పరిపాలనను అందించడంలో మోదీ సర్కారు విఫలం అవుతోందని విమర్శించారు. జమ్మూ కాశ్మీరుపై ఆయన వ్యూహాలన్నీ వృథా అయిపోయాయని, ప్రస్తుతం లోయలో జరుగుతున్న ఆందోళనలకు ప్రధానే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడి హింస, అనిశ్చిత పరిస్థితి, నిరసనలకు ఎవరినైనా విమర్శించాలంటే, అది నరేంద్ర మోదీనేనని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

  • Loading...

More Telugu News