: దుర్గ గుడి ఈవో వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు


విజయవాడలోని దుర్గ గుడి ఈవో సూర్యకుమారి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొండపైకి వెళుతున్న ఆమె వాహనాన్ని, పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొండపై వరకూ వీరి వాహనాలను అనుమతించమని పోలీసులు చెప్పటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాను ఈవోనని సూర్యకుమారి చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. అలాగే, దుర్గ గుడి ప్రధాన అర్చకుడు శివప్రసాద్ వాహనాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కుటుంబసభ్యులతో వచ్చిన పోలీస్ వాహనాలకు మాత్రం కొండపై వరకూ అనుమతిస్తున్న పోలీసులు, ఈవో, ప్రధాన అర్చకుడు, పుష్కరాల ప్రత్యేక అధికారుల వాహనాలను అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News