: నయీమ్ ముఠా వ్యూహం... ఆత్మరక్షణ కోసం పసికందులతో సంచరించేవారు


పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ , అతని ముఠాకు సంబంధించిన పలు విషయాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. ఇటీవల అరెస్టయిన ఫయీమ్ అనుచరుడు శ్రీధర్ గౌడ్, బలరాంలను కోర్టులో హాజరుపర్చగా, పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీసులు, శత్రువుల నుంచి తప్పించుకొనేందుకు అప్పుడే పుట్టిన పసి కందులతో నయీమ్ ముఠా సంచరించేదని పేర్కొన్నారు. తాను ప్రయాణించే సమయంలో కుటుంబ సభ్యులతో కలసి వెళ్తున్నట్లుగా బయట వ్యక్తులకు కన్పించేలా ప్లాన్ చేసుకునే వాడని, అందులో భాగంగానే శ్రీధర్ గౌడ్, పసికందులను తెచ్చి, టెక్ మధుకు అప్పగించే వాడని తెలిపారు. అతడు ఆ పసికందులను నయీమ్ కు అందించేవాడని పేర్కొన్నారు. నయీమ్ ప్రయాణించే సమయాల్లో కార్లలో పిల్లలు ఉండటంతో పోలీసుల తనిఖీల్లో అనుమానాలు రాకుండా జాగ్రత్తపడేవాడని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News