: మెడికోపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం!... ఆదిలాబాదు రిమ్స్ లో కలకలం!


తెలంగాణలోని ఆదిలాబాదు కేంద్రంగా ఏర్పాటైన రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో నేటి ఉదయం పెను కలకలమే రేగింది. వైద్య విద్యనభ్యసించేందుకు కళాశాలలో చేరిన ఓ విద్యార్థినిపై అక్కడ పనిచేసే ఓ ప్రొఫెసర్ వేధింపుల పర్వానికి పాల్పడ్డాడట. గత కొంతకాలంగా తనపై వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్ తాజాగా తనపై అత్యాచార యత్నం చేశాడని బాధిత మెడికో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమె ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టారు. నేటి ఉదయమే వెలుగుచూసిన ఈ ఫిర్యాదు రిమ్స్ లో కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News