: రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు


తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖాధికారులు ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. కాగా, నిన్న నిజామాబాద్ జిల్లా తాడ్వాయి, దోమకొండ లో రెండు సెంటీమీటర్ల చొప్పున, బాన్స్ వాడ, మక్లూర్, బిక్ నూర్, నవీపేటలో ఒక సెంటీ మీటర్ చొప్పున, ఖమ్మం జిల్లా బూర్గంపాడు, భద్రాచలంలో రెండు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News