: ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ కొనుక్కున్న ‘మజ్ను’... ఆకట్టుకుంటున్న నాని సినిమా టీజర్


యువహీరో నాని తాజా చిత్రం ‘మజ్ను’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈరోజు విడుదలైన ఈ టీజర్ ఆసాంతం వెరైటీగా ఉంది. ‘బాబాయ్... ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు’ అంటూ మొదలై, 'బాహుబలి' రథంలో ప్రేమ యుద్ధానికి వెళ్తూ ముగుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ‘మజ్ను’ టీజర్ మరింత క్రేజ్ ను పెంచింది. సెప్టెంబరు నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన కొత్త హీరోయిన్ అను ఎమ్మానుయేల్ నటిస్తోంది.

  • Loading...

More Telugu News