: వీళ్లు స్క్రీన్ పై బద్ధ శత్రువులు... సెట్ లో స్నేహితులు: దర్శకుడు వర్మ
వీళ్లు స్క్రీన్ పై బద్ధ శత్రువులు... సెట్ లో స్నేహితులు... ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ నటించే బాలీవుడ్ నటులు వీరు. ఆ బాలీవుడ్ నటులు నలుగురు ఒక చోట చేరి ఒక ఫొటో కూడా దిగారు. ఆ ఫొటో కథ ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం దర్శకుడు రాంగోపాల్ వర్మే. 1975లో విడుదలై సూపర్ డూపర్ హిట్ మాత్రమే కాదు, కొత్త చరిత్ర సృష్టించిన సినిమా ‘షోలే’. రమేష్ సిప్సీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జై, వీరు, ఠాకూర్, గబ్బర్ సింగ్ పాత్రల్లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్ నటించారు. అందులో ఒకరిని చంపడానికి మరొకరు మిగిలిన ఇద్దరిని కిరాయికి పిలిపించుకుంటారు. స్క్రీన్ పై బద్ధ శత్రువుల్లా కనపడే ఆ నలుగురు, సెట్ లో మాత్రం వారందరూ సరదాగా ఒకరి భుజాలపై మరొకరు చేతులేసుకుని ఫొటో దిగారంటూ అప్పటి ఈ చిత్రాన్ని దర్శకుడు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.