: ఢిల్లీలో డీజిల్ కార్లపై నిషేధాన్ని తొలగించిన సుప్రీం!
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ కార్లపై ఉన్న నిషేధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో 2000 సీసీకి పైన ఉన్న డీజిల్ కార్లు తిరగరాదని గతంలో సుప్రీం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్ల తయారీదారులు తాము నష్టపోతామని ఈ నిషేధం ఎత్తేయాలని అప్పీల్ చేసుకోవడంతో సుప్రీం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక శాతం పన్ను చెల్లించి ఆ కార్లలో తిరగొచ్చని చెప్పింది. ఆ కార్లతో వాతావరణం కాలుష్యమవుతోందని, అందుకుగాను ఆ కార్ల ఓనర్లు పర్యావరణ సెస్సు కట్టాలని సుప్రీం తెలిపింది.