: దుర్గమ్మ సన్నిధిలో నిబంధనలు పాటించని బాలకృష్ణ... పట్టించుకోని అధికారులు!


ఈ ఉదయం విజయవాడకు వచ్చిన సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుష్కర స్నానం అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లిన వేళ, ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలసి కొండపైకి సొంత వాహనాల్లో బయలుదేరిన బాలకృష్ణ ఘాట్ ప్రారంభం వద్ద ఉండే టోల్ గేట్ వద్ద ఎలాంటి రుసుమునూ చెల్లించలేదు. కొండపైకి వెళ్లే వాహనాల్లో వీవీఐపీ ప్రొటోకాల్ పరిధిలో ఉన్నవి మినహా మిగతా వాహనాలన్నీ టోల్ చెల్లించాల్సి వుంటుంది. దాదాపు ఆరు కార్ల కాన్వాయ్ లో టోల్ చెల్లించకుండానే బాలయ్య కొండపైకి వెళ్లిన వేళ, అధికారులు ఆ విషయాన్ని చూసీ చూడనట్టు వదిలివేశారు. ఇదే ఘటనను చూసిన భక్తులు మాత్రం, 'ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం' అంటూ కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News