: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల ధాటికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల ధాటికి ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దంటాల్‌లోని కూచ్‌నదికి వరద పోటెత్తడంతో బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో ఆ బ్రిడ్జిపై నుంచి కొనసాగాల్సిన రాకపోకలు ఆగిపోయాయి. మూడు రోజులుగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జి కొట్టుకుపోయిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి.