: ‘బార్‌ బార్‌ దేఖో’ రెండో ట్రైలర్‌లోనూ క‌త్రినా అందాల‌కు ఫిదా అయిపోతున్న అభిమానులు


బాలీవుడ్‌ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్‌లు జంట‌గా న‌టిస్తోన్న‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘బార్‌ బార్‌ దేఖో’. ఇటీవ‌లే ఈ చిత్రం యూనిట్ మొద‌టి ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి ట్రైల‌ర్‌లో క‌త్రినా కైఫ్ అందాల‌కు బాలీవుడ్‌ అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా చిత్రం యూనిట్ మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. దీంట్లోనూ క‌త్రినా ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. క‌త్రినా, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాల మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండింది. ‘సు ఆస్మాన్’ అనే ఈ సాంగ్‌లో క‌త్రినా క‌న‌బ‌ర్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌ అదుర్స్ అంటూ యూత్ కితాబిచ్చేస్తున్నారు. వ‌చ్చేనెల 9న ఈరోస్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News