: ‘అనంత’లో పడగ విప్పిన పాత కక్షలు!... ఇద్దరు వ్యక్తులను నరికేసిన ప్రత్యర్థులు!


ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అనంతపురం జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నేటి ఉదయం జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకెళితే... అనంతపురం జిల్లా కక్కలపల్లిలో అశోక్ రెడ్డి, జయచంద్రారెడ్ది అనే ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. కత్తులతో జరిగిన ఈ దాడిలో వారిద్దరూ ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. మృతులిద్దరినీ బుక్కచర్ల వాసులుగా గుర్తించారు. ఈ హత్యల వెనుక పాత కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News