: 'రుస్తుం'కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన అలియా భట్


బాలీవుడ్ లో గతంలో ఎన్నడూ లేని ట్రెండ్ కనిపిస్తోంది. ఖాన్ ల సినిమాలకు మాత్రమే ఉండే ప్రచార సందడి తాజాగా అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమాకు కూడా కనిపిస్తోంది. సినిమా ప్రమోషన్ లో అక్షయ్ కుమార్ బిజీగా ఉండగా, ఇతర బాలీవుడ్ నటులు కూడా 'రుస్తుం' సినిమాపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 12 న విడుదల కానున్న ఈ 'రుస్తుం' సినిమాకు బాలీవుడ్ యువతార అలియా భట్ ఆసక్తిగా శుభాకాంక్షలు తెలిపింది. గతంలో అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన 'మోహ్రా' సినిమాలో కుర్రకారును ఊపేపిన వాన పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసి, అక్షయ్ ను అభినందించింది. దీనిని చూసిన అక్షయ్ ఇక నుంచి తన ప్రతి సినిమాలో ఓ వాన పాట ఉండేలా ప్రయత్నిస్తానని...అలియా అద్భుతం అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

  • Loading...

More Telugu News