: పుష్కరాలకు సినీ ప్రముఖులను ఆహ్వానించాం: ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్
కృష్ణా పుష్కరాల్లో పుష్కర హారతికి బాధ్యత వహించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రముఖ సినీనటుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనలతో తాము సినీ ప్రముఖులను ఆహ్వానించామని ఆయన తెలిపారు.