: ఈ నెల 17న 'నీట్' ఫలితాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నీట్' పరీక్షా ఫలితాలు ఈ నెల 17న వెల్లడికానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు. దేశంలో మొత్తం ఒకే రకమైన వైద్యవిద్యావిధానం ఉండాలని, అందుకుగాను కేంద్రం నిర్వహించే నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ నెల 17న విడుదల చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని వారు తెలిపారు.