: ఎమ్మార్పీఎస్ ది న్యాయమైన డిమాండ్... రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలి!: వీహెచ్
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిది న్యాయమైన డిమాండ్ అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళనకారులను పరామర్శించి, వారికి సంఘీభావం పలికిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్ ఫలాలను ఒక వర్గం అనుభవించడం సరికాదని అన్నారు. అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని, మాదిగలు ఆందోళన చేయడంలో న్యాయం వుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాదిగ రిజర్వేషన్ కు అనుకూలమని, ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలుకుతుందని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.