: అంత్యక్రియల కోసం డబ్బులేక సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి హృతిక్ సాయం
బాలీవుడ్ హీరో, కండలవీరుడు హృతిక్ రోషన్ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ రియల్‌హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవలే ఆయన కేన్సర్ బాధితురాలైన తన అభిమానిని కలిసి ఆమె పెదవులపై చిరునవ్వు చిందేలా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. అంత్యక్రియల కోసం డబ్బులేక బాధపడుతోన్న ఓ అమెరికన్ కుటుంబానికి హృతిక్ సాయం అందించాడు. ‘కెట్టో’ పేరుతో ఓ వేదిక ప్రారంభించి బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నాడు. అమెరికాలో ఓ వ్యక్తి మరణిస్తే ఆయన అంత్యక్రియలకు డబ్బులేదని, మృతుడి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని కునాల్ కపూర్ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన హృతిక్.. వారికి రూ.5 లక్షలు పంపించాడు. హృతిక్ సరైన సమయంలో స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడని కునాల్ సామాజిక మాధ్యమం ద్వారా హర్షం వ్యక్తం చేశాడు