: మాకు రియల్ వ్యాపారాలు లేవు!... నేరాలు చేయాల్సిన అవసరమూ లేదు!: ఉమా మాధవరెడ్డి
పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలను తిప్పికొట్టిన సందర్భంగా దివంగత హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి, టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి... కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తన నివాసంలో కుమారుడు సందీప్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె కేసీఆర్ సర్కారుపై వ్యూహాత్మక దాడి చేశారు. తమకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవని చెప్పిన ఆమె... నేరాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదని పేర్కొన్నారు. నేరగాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు కేసీఆరే బాధ్యత వహించాలని కూడా ఆమె వ్యాఖ్యానించారు.