: బెలూన్స్, ప్లవర్స్, బొకేల మధ్య అందాల హన్సిక.. ఘనంగా బర్త్‌డే వేడుకలు!
దక్షిణాది సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ హన్సిక నిన్న తన ఇంట్లో ఘనంగా తన 25వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా బెలూన్స్, ప్లవర్స్, బుకేల మధ్య కూర్చోగా తాను దిగిన ఫోటోలను హన్సిక తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ వేడుకలో హన్సిక కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ హీరో మంచు విష్ణు పాల్గొన్నారు. తన పుట్టిన రోజు ఎంతో బాగా జరిగిందని హన్సిక ట్విట్టర్‌లో పేర్కొంది. అందరి ప్రేమాభిమానాలు తనతో ఉన్నాయని చెప్పింది. ఈరోజు చాలా మంచి రోజు అని ఆమె పేర్కొంది. తన పుట్టిన రోజు సందర్భంగా తనను విష్ చేసిన వారికి హన్సిక థ్యాంక్స్ చెప్పింది.