: మాదిగలకు వెంకయ్య దన్ను!... ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ దీక్షకు కేంద్ర మంత్రి సంఘీభావం!
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా పోరు సాగిస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)కి కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ మద్దతు లభించింది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలన్న డిమాండ్ తో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ వరుస ఆందోళనలతో మీడియా పతాక శీర్షికలకు ఎక్కారు. ఢిల్లీలో కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో భాగంగా నేడు మంద కృష్ణ మహాధర్నాకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ మహాధర్నాకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు సంఘీభావం తెలిపారు. దీక్షా స్థలి వద్దకు వచ్చిన వెంకయ్య... మాదిగల డిమాండ్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు.