: కృష్ణా పుష్కరాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్... రాష్ట్రాభివృద్ధి కోసం పవిత్ర సంకల్పం చేయాలని పిలుపు
కృష్ణా పుష్కరాలపై విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు దీనిలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పుష్కరాలు అందరిలోను స్ఫూర్తిని నింపాలని అన్నారు. విభజన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు. నదుల అనుసంధానంపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు వరుసగా రావడం ఒక అవకాశమని, కృష్ణా పుష్కరాల పనులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పవిత్ర సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు.