: రియోలో కాల్పుల కలకలం!... జర్నలిస్టుల బస్సుపై దుండగుల కాల్పులు!


రియో ఒలింపిక్స్ లో కొద్దిసేపటి క్రితం పెను కలకలం రేగింది. ఓ వైపు ఒలింపిక్ క్రీడా సంరంభంలో భాగంగా క్రీడాకారుల విన్యాసాలు, వాటిని తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాభిమానులతో నగరం సందడిగా ఉంది. ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని... అత్యాధునిక మెషీన్ గన్లు చేతబట్టిన కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. క్రీడా సంరంభాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. వెరసి అక్కడ పెను కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News