: సిబ్బంది నుంచి ఎటువంటి మర్యాదలు నాకొద్దు: ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్
తనను రిసీవ్ చేసుకునే సమయంలో, కలిసే సమయంలో చాలా మంది సిబ్బంది బొకేలు తీసుకుని వస్తున్నారని, ఎలాంటి మర్యాదలు అవసరం లేదని, తమ పని సరిగా చేసుకుంటూ పోతే చాలని ఎయిర్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరైక్టర్ అశ్వని లొహాని సూచించారు. ఈ మేరకు తమ సిబ్బందికి ఆయన అధికారిక లేఖ రాశారు. ఖర్చులు తగ్గించుకుని, సేవలను విస్తరించే కార్యక్రమంలో భాగంగానే ఆయన ఈ లేఖ రాశారు. తనను రిసీవ్ చేసుకునే సమయంలో కూడా చాలా మంది సిబ్బంది వస్తున్నారని, దాని వల్ల వారి సమయం వృథా అవడం తప్ప, ఎటువంటి ప్రయోజం ఉండదన్నారు. ఇకపై ఇలాంటివి చేయవద్దని సిబ్బందికి సూచించారు. తమ సంస్థ అధికారులు పనుల నిమిత్తం దేశంలో పలు ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు లగ్జరీ వాహనాలు వినియోగించవద్దని అశ్వని లొహానీ ఆదేశించారు.