: ఆజాద్ జన్మించిన ప్రాంతాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించిన గ్రామం అలిరాజ్‌పూర్ జిల్లాలోని భాభ్రా (అజాద్ కుతియా)కు వెళ్లారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారన్న విషయం తెలిసిందే. ఆజాద్ జన్మించిన ప్రాంతంలో పర్యటించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి మోదీ పర్యటన కొనసాగుతోంది. ఆజాద్ జీవితంలోని విశేషాలను తెలియపరుస్తూ చేసిన ప్రదర్శన విభాగాన్ని మోదీ సందర్శించారు. 'ఆజాదీ యాద్ కరో కుర్బానీ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించి మోదీ అక్కడ ఓ సదస్సు కూడా ఏర్పాటు చేయనున్నారు.