: పాక్ నిజ స్వరూపం బట్టబయలు!... ‘ఆజాదీ ఎక్స్ ప్రెస్’పై బుర్హాన్ వనీ పోస్టర్లు!
ఉగ్రవాదులకు ఆలవాలంగా మారిన పాకిస్థాన్... తాను కూడా ఉగ్రవాద బాధితురాలినేనని అడపాదడపా ప్రపంచ వేదికలపై చెప్పే మాటలన్నీ ఒట్టి బూటకమేనని తేలిపోయింది. ఈ తరహాలో ఇప్పటికే పలు సంచలన ఘటనలు వెలుగులోకి రాగా... తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో పాక్ తన ఉగ్రవాద సానుకూల వైఖరిని బయటపెట్టుకుంది. జమ్ము కశ్మీర్ లో కల్లోలానికి కారణంగా నిలుస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కీలక ఉగ్రవాది బుర్హాన్ వనీని గత నెల 8న భారత భద్రతా బలగాలు మట్టుబెట్టేశాయి. ఈ ఘటనపై పాక్ బాహాటంగానే తన నిరసనను వ్యక్తం చేసింది. బుర్హాన్ వనీని హీరోగా అభివర్ణిస్తూ సంతాప సభలకు అనుమతిచ్చింది. తాజాగా ఆ దేశ అధికారులు తమ దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రైలుగా భావిస్తున్న ‘ఆజాదీ ఎక్ప్ ప్రెస్’పై బుర్హాన్ వనీ పోస్టర్లను అంటించి ఉగ్రవాదికి ప్రచారం నిర్వహిస్తున్నారు.