: లోక్‌సభలో జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ.. పన్నురేటును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని ప్రకటన
అన్ని అడ్డంకులను తొలగించుకొని రాజ్యసభలో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్టీ) బిల్లు ఈరోజు లోక్‌సభ ముందుకు వచ్చింది. కొద్ది సేపటి క్రితం బిల్లుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ సవరణ బిల్లు కోసం తాము అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపామని అన్నారు. పన్నురేటును జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని చెప్పారు. మరోవైపు, బిల్లుకి లోక్‌సభలో కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత వీరప్పమొయిలీ అన్నారు. లోక్‌సభలోనూ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వస్తే వచ్చే ఏడాది అర్థిక సంవత్సర ప్రారంభం నుంచే అమలులోకి రానుంది.