: మృత్యు నిలయాలే... ముంబైలో కుప్పకూలిన భవంతి, 9 మంది మృతి


ముంబైలో మరో భవంతి కుప్పకూలింది. భారీ వర్షాలకు నానిపోతున్న పాత భవంతులు ప్రజల పాలిట యమపాశాలవుతున్నాయి. భీవండి ప్రాంతంలోని హనుమాన్ టేక్రీ వద్ద మూడంతస్తుల పాత భవనం ఈ ఉదయం కూలింది. ఈ ప్రమాదంలో భవంతిలో ఉన్న 9 మందీ మరణించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ భవనం పడిపోయి 8 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డ సంగతి తెలిసిందే. కాగా, ఈ భవనం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఎప్పుడైనా కూలుతుందని మునిసిపల్ అధికారులు ఇప్పటికే హెచ్చరించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయినా వినిపించుకోని కొన్ని కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News