: ఆమిర్‌ఖాన్‌పై నా వ్యాఖ్యలకు అందరూ ప్రశంసించారు: రక్షణ మంత్రి మనోహర్ పారికర్


బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు అందరూ ప్రశంసించారని రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. దేశ వ్యతిరేకులపై ఇప్పటికీ ప్రజల్లో సానుభూతి ఉందన్న పారికర్.. పుణెలో ఆమీర్‌ఖాన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు చాలామంది తనను ప్రశంసించారని తెలిపారు. అయితే పుణెలో తానేమన్నదీ మరోసారి చెప్పనని, ఆ వీడియో యూ ట్యూబ్‌లో ఉందని, కావాలంటే చూసుకోవచ్చని చమత్కరించారు. పుణెలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. ఆమిర్‌ఖాన్ పేరును ప్రస్తావించకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘తన భార్య ఇండియా విడిచిపోదామంటూ మొత్తుకుంటోందని ఓ నటుడు పేర్కొన్నాడు. ఇవి ముమ్మాటికీ దురహంకారపూరిత వ్యాఖ్యలే’’ అని మంత్రి అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. ముగిసిన వివాదాన్ని తిరిగి రేపుతున్నారంటూ విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News