: చిరంజీవి సినిమా కోసం కథ రాస్తున్న పవన్ కల్యాణ్!
తాను నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' కు కథను స్వయంగా రాసుకున్న పవన్ కల్యాణ్, మరోసారి కలం పట్టుకున్నట్టు తెలుస్తోంది. తన అన్న చిరంజీవి కోసం ఈ దఫా ఆయన కథ రాస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క నటిస్తూనే, మరోవైపు కథలూ రాయాలని భావిస్తున్న పవన్ కల్యాణ్, ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 'అత్తారింటికి దారేది' అనంతరం, పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి కూడా పవన్ స్వయంగా కథ రాసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు రాస్తున్న కథ చిరంజీవికా, త్రివిక్రమ్ తో చేయబోయే చిత్రానికా అన్నది తెలియాల్సివుంది.