: మహారాష్ట్రలో భారీగా పెరిగిన ఎమ్మెల్యేల వేతనాలు.. ఏకంగా 166 శాతం పెంచేసిన సర్కార్


మహారాష్ట్రలోని ఎమ్మెల్యేల‌కు స‌ర్కారు శుభ‌వార్త తెలిపింది. శాసనసభ్యుల వేత‌నాలను ఏకంగా 166 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. ఈమేర‌కు ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎమ్మెల్యేలు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల వేత‌నం నెల‌కు రూ.75వేలుగా ఉంది. 166 శాతం పెంపుతో ఇక‌పై రూ.2 లక్షలు అందుకోనున్నారు. గ‌తంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ స‌ర్కార్ శాస‌న స‌భ్యుల వేత‌నాలు ఇదే స్థాయిలో భారీగా పెంచిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News