: ఉక్కుమహిళ ఇరోం షర్మిలకు బెదిరింపులు


మణిపూర్‌లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేసిన మణిపూర్‌ ఉక్కు మహిళ, పౌరహ‌క్కుల ఉద్య‌మ‌కారిణి ఇరోమ్‌ షర్మిలకు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కొన్ని రోజుల క్రితం ఆమె తాను చేస్తోన్న దీక్షను విరమించనున్నట్లు, త్వ‌ర‌లోనే రాజకీయాల్లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాను ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకోనున్నట్లు కూడా ఆమె ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఓ రాడికల్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. ఆమె రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌డం, మణిపురీకి చెంద‌ని వ్యక్తితో వివాహం చేసుకుంటాననడం ప‌ట్ల ఆమెను బెదిరించారు. ఆ రాష్ట్రంలో గతంలో పలువురు ఉద్యమకారులు కూడా రాజకీయాల్లోకి వెళ్లారని అయితే దాని వల్ల లాభం లేకుండా పోయిందని, వారికి డెడ్‌ ఎండ్‌ అయిందని 'సెషనిస్ట్‌ అలయన్స్‌ ఫర్‌ సోషలిస్ట్‌ యునిటీ కాంగ్లీపాక్' తెలిపింది. మరో రెండు వేర్పాటు వాద మిలిటెంట్‌ సంస్థలు కూడా షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఆమె దీక్ష‌ను కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాయి.

  • Loading...

More Telugu News