: ఉత్తరాఖండ్‌ను కుదిపేయనున్న భారీ భూకంపం... ఎప్పుడొచ్చేది చెప్పలేకపోతున్న అధ్యయనాలు
ఉత్తరాఖండ్‌ను భారీ భూకంపం కుదిపేయనుందా..? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. ఉత్తరాఖండ్ సెంట్రల్ సీస్మిక్ గ్యాప్‌లో ఉండడంతో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టు పలు అధ్యయనాలు వెల్లడించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఈ భూకంపం ఎప్పుడు వచ్చేది మాత్రం అధ్యయనాలు పేర్కొనలేదు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్‌లోని ఎర్త్ అబ్జర్వేటరీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రాంతం సీస్మిక్ గ్యాప్‌లో ఉండడం, గత 500 సంవత్సరాల్లో భూకంపం రాకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న పలు అధ్యయనాలు అది ఎప్పుడు వస్తుందన్న దాన్ని మాత్రం అంచనా వేయలేకపోయాయని ఎర్త్ సైన్స్ సహాయ మంత్రి వైఎస్ చౌదరీ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు.