: డెహ్రాడూన్‌లో తొలి టైగర్ సెల్... పులులకు సంబంధించిన అన్ని వివరాలు ఇక అందుబాటులోకి!


ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో దేశంలోనే తొలి టైగర్ సెల్ ఏర్పాటు కాబోతోంది. వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సెల్ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్టీసీఏ), డబ్ల్యూఐఐ మధ్య శనివారం ఎంఓయూ కుదరనుంది. టైగర్ సెల్ ఏర్పాటుతో పులుల డేటాబేస్, డీఎన్ఏ, 50 వరకు పెద్దపులుల చారల నమూనాలు, పులుల సంఖ్య, వేటగాళ్లకు సబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి. ఎప్పటికప్పుడు ఈ విషయాలను అప్‌డేట్ చేస్తుంటారు. అలాగే ఈ సెల్‌లో దేశవ్యాప్తంగా పులులకు సంబంధించిన అన్ని ఫొటోలు అందుబాటులో ఉంటాయని ఈ సెల్‌కు చీఫ్‌గా వ్యవహరించబోతున్న సీనియర్ సైంటిస్ట్ వైవీ జాలా పేర్కొన్నారు. తద్వారా ఏదైనా పులి వేటగాళ్ల బారిన పడినా, చనిపోయినా తమ వద్ద ఉన్న చారల నమూనాలతో పోల్చి చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. కొన్ని నెలల క్రితం ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. ఓ వేటగాడి దగ్గర లభించిన నాలుగు పులి చర్మాలను ఇలాగే గుర్తించినట్టు జాలా వివరించారు.

  • Loading...

More Telugu News