: కశ్మీర్‌లో భారత్ బహిరంగ ఉగ్రవాదానికి పాల్పడుతోంది: మరోమారు నోరు పారేసుకున్న పాక్


కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ మరోమారు నోరుపారేసుకుంది. సార్క్ సమావేశంలో మాట్లాడిన పాక్ అంతర్గత శాఖా మంత్రి నిసార్ అలీ ఖాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అక్కడ భారత దళాలు అవలంబిస్తున్న తీరు ముమ్మాటికీ బహిరంగ ఉగ్రవాదం కిందకు వస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతున్న భారత్ స్వాతంత్ర్య పోరాటాన్ని, ఉగ్రపోరుకు మధ్య తేడా తెలుసుకోలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కశ్మీర్‌లోని అమాయక ప్రజలను అణచివేయాలని భారత్ చూస్తోందంటూ వ్యాఖ్యానించారు. అయితే పాక్ వ్యాఖ్యలను అదే వేదికపై భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులపై పాక్ అవలంబిస్తున్న తీరును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కడిగిపారేశారు. ఒక దేశానికి ఉగ్రవాది అయిన వ్యక్తి మరో దేశానికి స్వాతంత్ర్య సమరయోధుడు, అమరుడు ఎలా అవుతాడంటూ బుర్హాన్ వనీని కీర్తిస్తున్న పాక్ వైఖరిని ఎండగట్టారు.

  • Loading...

More Telugu News